తారక్ 20 సినీ కెరీర్ పై ఫ్యాన్స్ కిరాక్ పోస్టర్

తారక్ 20 సినీ కెరీర్ పై ఫ్యాన్స్ కిరాక్ పోస్టర్

టాలీవుడ్ లో ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఎలాంటి డైలాగ్ నైనా సునాయాసంగా చెప్పగలిగే నటుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అతనిది. ఇక ఆయన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు ‘ జూనియర్ నందమూరి తారక రామరావు ‌’...కానీ అభిమానులు మాత్రం ముద్దుగా ‘యంగ్‌ టైగర్‌’గా పిలుచుకుంటారు. ఎన్టీఆర్ ను చూస్తే ఆ టైటిల్ అతని కోసమే అన్నట్టుగా ఉంటాడు. తారక్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి 20 ఏళ్ళు అయ్యింది. మొదట బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత 16 ఏళ్ళ వయసులోనే నిన్ను చూడాలని ఉంది సినిమాతో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కాస్త డీలా పడ్డ తారక్ వెంటనే రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదటి హిట్టు అనుకున్నాడు.ఇప్పటికీ స్టార్ హీరో గా కంటిన్యూ అవుతున్నాడు తారక్. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై అభిమానులు ఒక అద్బుతమైన పోస్టర్ ను రెడీ చేశారు. తారక్ నటించిన అన్ని సినిమాల్లో స్టిల్స్ తో ఈ పోస్టర్ ను డిజన్ చేశారు ఫ్యాన్స్ . ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.