ఐపీఎల్ స్పాన్సర్స్ గా అభిమానులు ఆ రెండు పేర్లను బీసీసీఐకి సూచిస్తున్నారు...

ఐపీఎల్ స్పాన్సర్స్ గా అభిమానులు ఆ రెండు పేర్లను బీసీసీఐకి సూచిస్తున్నారు...

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగనున్నట్లు ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. కానీ నిన్న ఐపీఎల్ స్పానర్  గా వివో కంపెనీ తన స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. దాంతో బీసీసీఐ మరో కొత్త స్పానర్స్ కోసం వెతుకులాట ప్రారంభించింది. అయితే లడఖ్ ఘటన తర్వాత చైనా కు వ్యతిరేకత భారత్ లో బాగా పెరిగిపోయింది. దాంతో చైనా ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అయిన వివో స్పాన్సర్షిప్ ను రద్దు చేసుకోవాలని అభిమానులు బీసీసీఐకి సూచించారు. అయితే బీసీసీఐ అభిమానుల మాటను పట్టించుకోకపోయినా వివోనే స్వయంగా తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇక ఇప్పటివరకు వివో తో స్పాన్సర్షిప్ ను రద్దు చేసుకోవాలని చెప్పిన అభిమానులు కొత్త స్పాన్సర్ షిప్ కోసం ఈ భారత కంపెనీలను తీసుకోండి అని  బీసీసీఐ కు సూచిస్తున్నారు. అందులో ప్రముఖంగా జియో, పతంజలి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలోనైనా బీసీసీఐ అభిమానుల మాట వింటుందా అనేది చూడాలి.