అలర్ట్‌‌..! 'ధరణి' పేరుతో నకిలీ యాప్‌..

అలర్ట్‌‌..! 'ధరణి' పేరుతో నకిలీ యాప్‌..

తెలంగాణ ప్రభుత్వం 'ధరణి' వెబ్‌సైట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.. ఇతర రిజిస్ట్రేషన్లు కూడా త్వరలోనే ధరణి ద్వారా చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఇదే సమయంలో.. ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్‌ ప్రత్యక్షం కావడం అందరినీ కలవరపెట్టే అంశం.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

భూ సమగ్ర సర్వేల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'ధరణి'ని తీసుకురాగా.. దాని పేరుతో మొబైల్ యాప్ క్రియేట్ చేసి వదిలారు కేటుగాళ్లు.. ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని.. 5 రోజుల క్రితం టీఎస్ డైరెక్టర్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేష్ , ప్రేమ్ మూలె అనే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇప్పుడు అందరూ ధరణిపై ఆసక్తిగా ఉన్నారు.. ఏదో యాప్ ఉందికదా? అని డౌన్‌లోడ్ చేసుకుని.. మీ వివరాలు నమోదు చేసుకునే ముందు అది అసలా? నకిలీయా? అనేది ఓ సారి చెక్‌ చేసుకోవడం మంచిది.