స్మిత్ వివాదంలో కొత్త ట్విస్ట్... 

స్మిత్ వివాదంలో కొత్త ట్విస్ట్... 

ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే  ఆసీస్-భారత్ మూడో టెస్ట్ చివరి రోజు భారత ఆటగాడు రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఆడుతున్న సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ డ్రస్సింగ్ రూమ్స్‌కి చేరుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి స్టీవ్ స్మిత్ మైదానంలో బ్యాటింగ్ సమయంలో వికెట్ల వద్ద రిషబ్ పంత్ చేసుకున్న గార్డ్ మార్క్‌ను చెరిపేశాడు. ఇదంతా అక్కడి స్టంప్స్‌కి ఉన్న మెయిల్స్ కెమెరాలో చిక్కింది. ఆ తర్వాత ఈ వీడియో బయటికి రావడంతో తెగ వైరల్ అయ్యింది. దీంతో స్మిత్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కానీ తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో... ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్స్‌కి వెళ్లిన తర్వాత గ్రౌండ్ క్లినింగ్ స్టాఫ్ వచ్చి గ్రౌండ్ ను శుభ్రం చేసారు. అలాగే అక్కడ కొత్తగా క్రీజు లైన్ ను మళ్ళీ గీశారు. అయితే వారు గ్రౌండ్ ను క్లిన్ చేసిన సమయంలోనే  రిషబ్ పంత్ చేసుకున్న గార్డ్ మార్క్‌ చెరిగిపోయింది. అయితే ఈ వీడియో ఆధారంగా చూస్తే స్మిత్ ఏ తప్పు చేయలేదని అర్ధం అవుతుంది.