వక్ఫ్ బోర్డ్‌పై జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!

వక్ఫ్ బోర్డ్‌పై జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!

వక్ఫ్‌ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్... వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... వక్ఫ్ బోర్డు పదవి పాములపుట్టగా వ్యాఖ్యానించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపిన జలీల్‌ఖాన్.. వైఎస్ జగన్ మంచి పాలన అందివ్వాలని ఆకాక్షించారు. ఇక తన హయాంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు గుర్తుచేసుకున్న జలీల్ ఖాన్... సార్వత్రిక ఎన్నికల్లో పని చేసిన కార్యకర్తల కృషి మరువలేనిదంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.