డ్వాక్రా మహిళల ఖాతాల్లో 3,500

డ్వాక్రా మహిళల ఖాతాల్లో 3,500

గురువారం సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... డ్వాక్రా మహిళలు అందరికీ ఈ రోజు మరో శుభదినం. పసుపు-కుంకుమ కింద రెండో విడత చెల్లింపులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మహిళ ఖాతాలో గురువారమే రూ.3,500 జమ అవుతుందని.. రేపు మహిళా దినోత్సవం రోజే అందరికీ నగదు అందనుందన్నారు. మహిళలకు మరో విడతగా రూ.4వేలు త్వరలోనే చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు అన్నిచోట్ల డ్వాక్రా మహిళలు ర్యాలీలు నిర్వహించనున్నారు.