రివ్యూ: ఎవరు 

రివ్యూ: ఎవరు 

నటీనటులు: అడివిశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు

మ్యూజిక్: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌

సినిమాటోగ్రఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు

నిర్మాత: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె

దర్శకత్వం: వెంకట్ రాంజీ

ఇటీవల కాలంలో థ్రిల్లర్ జానర్లో అనేక సినిమాలు వస్తున్నాయి.  కథ కథనాలతో పాటు థ్రిల్ కలిగించే అంశాలు సినిమాలో ఉన్నాయి అంటే.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.  అడవి శేషు క్షణం సినిమా ఇదే తరహాలో హిట్ అయ్యింది.  గూఢచారి కూడా మంచి విజయం సాధించింది.  ఇప్పుడు ఎవరు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉన్నదో తెలుసుకుందాం.  

కథ: 

రెజీనా రిసెప్షనిస్ట్ నుంచి ఎదిగి.. ఓ పారిశ్రామిక వేత్తను వివాహం చేసుకుంటుంది.  అయితే, అనుకోకుండా డిఎస్పి నవీన్ చంద్రను హత్యచేస్తుంది.  హత్యచేయడానికి రెజీనా కారణాలు చెప్తుంది.  నవీన్ చంద్ర తనపై హత్యాచారం చేయబోయాడని, తనను తాను రక్షించుకునే సమయంలో హత్య చేయాల్సి వచ్చిందని చెప్తుంది.  ఈ కేసును పోలీస్ అధికారి అడవి శేషుకు అప్పగిస్తారు.  ఆయనకు అవినీతి అధికారిగా పేరు ఉంటుంది.  రెజీనాకు కాపాడేందుకు ఆమె దగ్గర లంచం తీసుకుంటాడు.  ఆమెను కాపాడేందుకు కోర్టులో జరిగే విషయాలన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.  అదే సమయంలో సమీరా నుంచి కొన్ని నిజాలు తెలుసుకోవాలని ఆమెను ప్రశ్నిస్తే.. ఆమె ఇచ్చే సమాధానాలు వేరుగా ఉండటంతో అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.  ఈ క్రమంలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి.. ? నవీన్ చంద్రను రెజీనానే హత్య చేసిందా..? ఆమెపై నిజంగా హత్యాచార యత్నం జరిగిందా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటేనే ఎన్నో ప్రశ్నలు.. చిక్కుముడులు వాటిని పరిష్కరించేందుకు జరిగే పోరాటాలు ఉంటాయి.  ఒక్కోదాన్ని విడదీసుకుంటూ పోతుంటే.. కథ పరిష్కారం జరుగుతుంది.  ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. హత్య చేసింది ఎవరు.. దాని చుట్టూనే కథ తిరుగుతుంది.  సీమ ప్రారంభంలోనే హత్య జరిగిన సీన్ వస్తుంది.  కథను ఎటెటో తిప్పకుండాఆ స్ట్రెయిట్ గా కథలోకి తీసుకెళ్లాడు.  హత్యను డీల్ చేసే అధికారిగా అడవిశేషు పరిచయంతో కథలో స్పీడ్ పెరిగింది.  

శేషు అడిగే ప్రశ్నలకు.. రెజీనా చెప్పే సమాధానాలకు పొంతన ఉండదు.  ఆమె చెప్పే ఒక్కో జవాబు నుంచి ఒక్కో అనుమానం మొదలౌతుంది.  ఈ అనుమానాలు కథలో కీలక మలుపులుగా మారతాయి.  ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు.. జవాబులు వాటి చుట్టూ అనుమానాలతోనే నిండిపోతుంది.  

సెకండ్ హాఫ్ అన్ని చిక్కుముడులు ఉన్నాయి.  వాటిని సెకండ్ హాఫ్ లో విడదీసే ప్రయత్నం చేస్తాడు.  డిఎస్పి నవీన్ చంద్ర హత్య, మురళీ శర్మ లకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చెనందుకు కథ చాలా థ్రిల్లింగ్ గా ఉన్నది.  వాటిని చేసింది ఎవరు అని తెలిసిన తరువాత కథలో తెలియని గందరగోళం ఏర్పడింది.  ఫైనల్ గా కీలకమైన ట్విస్ట్ తో క్లైమాక్స్ పూర్తవుతుంది. 

నటీనటుల పనితీరు: 

అడవి శేషు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు.  సినిమా అంతా ఒకెత్తయితే.. క్లైమాక్స్ లో ఆయన నటన మరొక ఎత్తు.  క్లైమాక్స్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  రెజీనా తన నటనతో ఆకట్టుకుంది.  కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.  నవీన్ చంద్ర, మురళీ శర్మ మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.  

సంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు వెంకట్ రాంజీ కథను తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పాలి.  సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు.  ఎక్కడా థ్రిల్లింగ్ ను మిస్ కానివ్వలేదు.   ఫొటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోసింది.  థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది.  శ్రీచరణ్ అద్భుతమైన సంగీతం అందించారు.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

నటీనటులు 

క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో గందరగోళం

చివరిగా : ఎవరు.. థ్రిల్లింగ్ ను కలిగించింది.