రాజీనామాకు సిద్దం : ఈటల సంచలన వ్యాఖ్యలు

రాజీనామాకు సిద్దం  : ఈటల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సిఎం కెసిఆర్, ఆయన కేబినెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్.  తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజల దగ్గర వెళ్లి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకుంటానని.. ఈటెల పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి కాదన్నారు. మానవ సంబంధాలు శాశ్వతమని.. ఎన్ని రోజులు జెల్లో పెడతావు.. అసెంబ్లీలో పేగులు బయట పడేలా తెలంగాణ కోసం కొట్టాడానని గుర్తు చేశారు. నా ఆస్తులపై నిజాయితీగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని..నేను చేసే పని ఆత్మగౌరవ సమస్య అని తెలిపారు. నేను చెడు పని చేసి దూరం కాలేదు...మమ్ములను మంత్రులుగా కాకున్నా మనుషులుగా చూడండి అని అంటున్నామని పేర్కొన్నారు. మీదగ్గర ఉన్న ఏ ఒక్క మంత్రి ఆత్మ గౌరవంతో లేరని..చట్టాన్ని, సిస్టమ్ ను పక్కన పెట్టి పని చేస్తున్నారని చురకలు అంటించారు. చావును బరిస్తా... కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టబోనని తెలిపారు. కేసీఆర్ ఏవిధంగా పగ బడతారో అందరికి తెలుసు... ఒకసారి కేసీఆర్ తలుసుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది నాకు బాగా తెలుసని పేర్కొన్నారు. నా కార్యకర్తలు ఆవేశానికి లోనై ఏమి చేయొద్దు అని సూచించారు.