పోర్న్ స్టార్‌గా ఎస్తేర్!

పోర్న్ స్టార్‌గా ఎస్తేర్!

''ప్రపంచం కీర్తించే భారతీయ సాంప్రదాయం ముసుగులో మలినం ఉంది. సొసైటీ కళ్ళప్పగించి చూసే కళారంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది'' అంటున్నారు దర్శకుడు తిరుపతి ఎస్. ఆర్. 'ఉత్తర' సినిమా కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన తిరుపతి ద్వితీయ యత్నంగా 'హీరోయిన్' మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి ఎస్తేర్ పోర్న్ స్టార్ పాత్రలో నటిస్తోందట. కథానుసారం ఆమె కొన్ని సన్నివేశాలలో బోల్డ్ గా కనిపించిందని, ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపాడు. ఈ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని లివ్ ఇన్ సి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.