భారత్-ఇంగ్లాండ్ సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా... 

భారత్-ఇంగ్లాండ్ సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా... 

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా చాలా అంతర్జాతీయ సిరీస్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అందులో మరో సిరీస్ చేరింది. కరోనా కారణంగా వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఆరు మ్యాచ్‌ల పరిమిత-ఓవర్ల సిరీస్‌(3 వన్డే, 3 టీ 20)లను బీసీసీఐ వాయిదా  వేసింది. అయితే ఈ వాయిదాకు కారణం కరోనా కాదు మన ఐపీఎల్ . ఈ ఏడాది సెప్టెంబర్-నవంబర్ విండోలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహిస్తుంది. ఆ కారణంగా సెప్టెంబర్ లో జరగాల్సిన ఇంగ్లాండ్ సిరీస్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. అయితే నవంబర్ 10 న ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు నేరుగా ఆసీస్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ డిసెంబరు 3 నుంచి నాలుగు టెస్టులు, జనవరి 12 నుంచి మూడు వన్డేలు ఆడనుంది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా భారత్‌కి వచ్చిన వెంటనే ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి-మార్చిలో సిరీస్‌ని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది ఇందుకోసం ఈసీబీతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.