ఇంగ్లాండ్-పాకిస్థాన్ : చెలరేగిన క్రాలే, బట్లర్‌ జోడి... 

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : చెలరేగిన క్రాలే, బట్లర్‌ జోడి... 

ఇంగ్లాండ్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ లో నిన్న రెండో రోజు జాక్‌ క్రాలే, వికెట్ కీపర్ జోస్‌ బట్లర్‌ చెలరేగిపోయారు. నిన్న ఆట ప్రారంభ సమయానికి 4 వికెట్లు చేజార్చుకొని 332 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 583 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి 8 వికెట్లు కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రాలే 267 పరుగులు, బట్లర్‌ 152 పరుగులు చేసి 359 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే పాకిస్థాన్ బౌలర్ లలో ఫవాద్ ఆలం, షాహీన్ అఫ్రిది, యాసిర్ షా రెండేసి వికెట్లు తీసుకోగా నసీమ్ షా, అసద్ షఫీక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ డిక్లేర్ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ మొదట్లోనే తడబడింది. నిన్న ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది పాక్. కెప్టెన్ అజార్ అలీ (4)తో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ ఒక్కడే ఆ మూడు వికెట్లు సాధించాడు.