ఇంగ్లాండ్-పాకిస్థాన్ : ముందు వరుణుడు.. తర్వాత వెలుతురు

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : ముందు వరుణుడు.. తర్వాత వెలుతురు

ఈ రోజు ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో రెండో టెస్ట్ లో రెండో రోజు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి రోజు కేవలం 126 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. అయితే ఈ రోజు మ్యాచ్ వరుణుడి రాకతో కొంత ఆలస్యంగా మొదలైంది. ఇక ఆట ప్రారంభమైన తర్వాత పాక్ తడబడింది అనే చెప్పాలి. ఈ రోజు పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (60*) తో రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రిజ్వాన్ తో పటు చివరి ఆటగాడు నసీమ్ షా(1)తో ఉన్నాడు. అయితే ఈ రోజు పాక్ ఆల్ ఔట్ అవుతుంది అనుకున్నారు. కానీ చివరి సెషన్ కు వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. దాంతో పాక్ తప్పించుకుంది అనే చెప్పాలి.