ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి టెస్ట్ రెండో రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి టెస్ట్ రెండో రోజు...

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్ తన రెండో టెస్ట్ సిరీస్ పాకిస్థాన్ తో ఆడుతుంది. అయితే పాక్ కు మాత్రం ఇదే మొదటి సిరీస్. మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మొదటి మ్యాచ్ నిన్న ప్రారంభమైంది. కానీ ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో నిన్న మొత్తం 49 ఓవర్లు మాత్రమే పడ్డాయి. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఇందులో బాబర్ అజామ్ అర్ధశతకంతో రాణించాడు. ప్రస్తుతం బాబర్ అజామ్(69), షాన్ మసూద్(46) వద్ద బ్యాటింగ్ మొదలుపెట్టారు. మరి ఈ రోజైన ఆట పూర్తిగా సాగుతుందా... లేదా మళ్ళీ మ్యాచ్ లో వరుణుడు ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.