ఇంగ్లాండ్-పాకిస్థాన్ : ముందు వరుణుడు.. తర్వాత వెలుతురు

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : ముందు వరుణుడు.. తర్వాత వెలుతురు

ఈ రోజు ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అందులో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికి వరుణుడు వచ్చాడు. దాంతో దాదాపు మొదటి సెషన్ చివరి భాగం మరియు రెండో సెషన్ పూర్తిగా రద్దయింది. ఇక వర్షం ఆగిన తర్వాత మూడో సెషన్ ప్రారంభించారు. కానీ వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను ముంగించేసారు. దాంతో మొదటి రోజు మొత్తం కేవలం 49 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. అయితే ఆటముగిసే సమయానికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బాబర్ అజామ్ అర్ధశతకంతో రాణించాడు. ప్రస్తుతం బాబర్ అజామ్(69), షాన్ మసూద్(46) వద్ద గ్రౌండ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు  జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీసుకున్నారు.