ఇంగ్లాండ్-పాకిస్థాన్ మొదటి టెస్ట్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మొదటి టెస్ట్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్...

గత నెలలో ఎన్నో కరోనా పాజిటివ్ ల మధ్య పాకిస్థాన్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ రోజు ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అందులో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఇంతకముందు వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ మళ్ళీ దానిని కొనసాగించాలని చూస్తుంది. అయితే  పాక్ ఆటగాళ్లకు మాత్రం కరోనా బ్రేక్ తర్వాత ఇదే మొదటి సిరీస్ కాబట్టి అందులో విజయం సాధించాలనే ఉత్సహం తో ఉన్నారు. 

ఇంగ్లాండ్ జట్టు : రోరే బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జో రూట్ (c), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, జోస్ బట్లర్ (wk), క్రిస్ వోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

పాకిస్థాన్ జట్టు : అజార్ అలీ (c), షాన్ మసూద్, అబిద్ అలీ, బాబర్ అజామ్, అసద్ షఫీక్, మహ్మద్ రిజ్వాన్ (wk), షాదాబ్ ఖాన్, యాసిర్ షా, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా