ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఈ రోజు చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో మొదటిది ఇంగ్లాండ్ రెండోవది ఆసీస్ గెలిచింది. దాంతో ఈ మూడో మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో సిరీస్ వారిదే. అయితే ఈ సిరీస్ కంటే ముందు జరిగిన టీ 20 సిరీస్ ను ఇంగ్లాండ్ సొంతం చేసుకోవడంతో ఈ వన్డే సిరీస్ ను ఎలాగైనా గెలవాలని ఆసీస్ చూస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (c), జోస్ బట్లర్ (wk), సామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, టామ్ కుర్రాన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్

ఆసీస్ జట్టు : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (c), మార్కస్ స్టోయినిస్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (wk), గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా