టీ20 ఫార్మాట్ లో అగ్రస్థానానికి చేరుకున్న ఇంగ్లాండ్...

టీ20 ఫార్మాట్ లో అగ్రస్థానానికి చేరుకున్న ఇంగ్లాండ్...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా దక్షిణాఫ్రికా తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ ర్యాంకింగ్ పట్టికలో తమ రేటింగ్స్ పాయింట్స్ ను 275 కు మెరుగుపరుచుకుని మొదటి స్థానానికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా (275), భారత్ (266) పాకిస్థాన్ (262), దక్షిణాఫ్రికా (252) వరుసగా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత జట్టు ఆసీస్ పర్యటన లో ఉంది. ఇందులో భాగంగా ఈ రెండు జట్ల కూడా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో పోటీ పడనున్నాయి. కాబట్టి ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టుకు మొదటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది.