రెండో ఇన్నింగ్స్‌లోనే చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 81 పరుగులకే ఆలౌట్..

రెండో ఇన్నింగ్స్‌లోనే చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 81 పరుగులకే ఆలౌట్..

మొతెరా టెస్టులో ఇంగ్లండ్‌ కుప్పకూలింది. భారత బౌలర్ల దాటికి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తక్కువ పరుగులకే ఆలౌటయ్యింది. కేవలం 81 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది. డే అండ్ నైట్ టెస్టు... టీట్వంటీని తలపిస్తోంది. స్పిన్‌ ట్విన్స్‌ అశ్విన్‌, అక్షర్ పటేల్‌... మాయజాలంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఒక్కరంటే ఒక్కరు రాణించలేకపోయారు. ఇలా వచ్చి అలా వెళ్లారు. క్రోజులో కాసేపు కూడా నిలువలేకపోయారు. అక్సర్ పటేల్ ఐదు వికెట్లు తీయగా... అశ్విన్‌కు నాలుగు వికెట్లు తీశారు. రెండ్రోజుల్లో ఈ స్పిన్ ద్వయం.. 19 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌ ముందు 49 పరుగుల టార్గెట్‌ పెట్టింది ఇంగ్లండ్‌. అంతకు ముందు టీమిండియా ఆటగాళ్లు కూడా తంటాలు పడ్డారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు తడబడిన పిచ్‌పై మన బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలిచేందుకు పోరాటమే చేశారు. ఇంగ్లాండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌, కెప్టెన్‌ జో రూట్‌ స్పిన్‌ దెబ్బకు టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. వీరిద్దరూ పోటీపడి వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది.