బెదిరింపు ఈమెయిల్స్.. ట్రంప్‌కు ఓటు వేయకపోతే అంతే..!
ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే... కరోనాబారినపడిన ట్రంప్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రచారం మొదలు పెట్టారు.. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలన్న కసితో ఉన్నారు.. అయితే,, ట్రంప్‌కు సర్వేలు మాత్రం షాక్‌లు ఇస్తున్నాయి... కానీ, గతంలోనూ ఇలాంటి సర్వేలే వచ్చాయి... విజయం మాదేనన్న ధీమాతో ట్రంప్ శిబిరం ఉందంటున్నారు.. కరోనా దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.. అయితే.. తాజాగా, అమెరికా నిఘా వర్గాలు సంచలన విషయాన్ని ప్రకటించాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి రష్యా, ఇరాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. వచ్చే నెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులకు అనుమాస్పద ఈమెయిల్ సందేశాలు వస్తున్నట్టుగా గుర్తించారు.. వాటి సారాంశం ఏంటంటే.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేయకుంటే మీ అంతుచూస్తాం.. ఎన్నికలు పూర్తైన వెంటనే మీ పని పడతాం అని హెచ్చరిస్తూ.. ‘ప్రౌడ్ బాయ్స్’ అనే సంస్థ పేరిట ఈ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టుగా గర్తించారు. మరోవైపు.. దీని వెనుక ఇరాక్ హస్తం ఉందని.. ఇదంతా ట్రంప్ ప్రతిష్టను దిగజార్చే కుట్ర అంటున్నారు అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్. అయితే, అమెరికా నిఘా వర్గాల ప్రకటనను ఖండించింది ఇరాన్... అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)