చింతమనేని ఎఫెక్ట్...విధులు బహిష్కరించిన లాయర్లు 

చింతమనేని ఎఫెక్ట్...విధులు బహిష్కరించిన లాయర్లు 

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సహకరించారన్న ఆరోపణలపై న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎందుకు సోదాలు చేశారని ప్రశ్నిస్తూ చింతమనేని ఇంటికి వచ్చిన పోలీసులను బయటకు పోనివ్వకుండా ఈడ్డుగంటి శ్రీనివాస్ తాళాలు వేశారు. అయితే తమ బాద్యతలు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని శ్రీనివాస్ పై  కేసు నమోదు చేసిన పోలీసులు చింతమనేనితో పాటు ఈడ్పుగంటిని కూడా అరెస్ట్ చేశారు. న్యాయవాది అరెస్ట్ పై బార్ కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరించి నిరసన తెలిపారు. ఓ న్యాయవాదిగా క్లయింట్ కోసం వెళ్లిన ఈడ్పుగంటిని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారంటూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు.