ప్రపంచ కుబేరుడి తాజా అఫర్: ఆ పనిచేస్తే భారీ బహుమానం
ప్రపంచ కుబేరుడిగా పేరు తెచ్చుకున్న ఎలాన్ మస్క్ తాజాగా ఓ అఫర్ ను ప్రకటించారు. ప్రపంచంలో పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల బహుమానం ఇస్తానని ప్రకటించారు. ప్రపంచానికి కర్బన ఉద్గారాలు పెనుముప్పుగా మారాయి. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వలన వేడి పెరిగిపోతున్నది. ప్రకృతిలో సమతుల్యత లోపిస్తోంది. వీటన్నింటికి కారణం కర్బన ఉద్గారాలే. వీటిని తగ్గించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అందుకే వీటిని తగ్గించే సాంకేతికపై దృష్టి సారించారు ఎలాన్ మస్క్. ఎవరైతే వీటిని తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేస్తారో వారికి రూ.730 కోట్లు భారీ బహుమానం అందిస్తానని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)