బార్లో కాల్పులు... 11 మంది మృతి...
ప్రపంచంలో మత్తుపదార్దాల విక్రయం, తుపాకీ కల్చర్ పెరిగిపోయింది. దీంతో పాటుగా నేరాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం మెక్సికో దేశంలో ఎక్కువగా జరుగుతుంది. మెక్సికోలోని గ్వానాజువాటోలో మరి ఎక్కువగా ఉంటుంది. మెక్సికోలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలోని జరల్ డెల్ ఫ్రాగ్రేసో నగరంలోని ఓ బార్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందినవారంతా ఆ బార్ లో డ్యాన్సర్లుగా పనిచేస్తున్నారని సమాచారం. మాదక ద్రవ్య మాఫియా ముఠానే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అంటున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)