జీతంలో కూడిన సెలవులను మొదట ఏ దేశంలో మొదలుపెట్టారో తెలుసా? 

జీతంలో కూడిన సెలవులను మొదట ఏ దేశంలో మొదలుపెట్టారో తెలుసా? 

జీతంతో కూడిన సెలవులు ... ఈ మాట ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వినియోగిస్తుంటారు.  అయితే, జీతంతో కూడిన సెలవులు అనే మాటను మొదట ఎక్కడ ఎవరు ఉపయోగించారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.  దీని గురించి తెలుసుకోవాలి అంటే మనం క్రీస్తు పూర్వం 46 వ శతాబ్దానికి వెళ్ళాలి.  క్రీస్తు పూర్వం 46 వ శతాబ్దంలో జూలియస్ సీజర్ జూలియట్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. ఈ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 365 రోజుల 6 గంటల సమయంగా గుర్తించారు.  అయితే, తరువాత కాలంలో శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం సంవత్సరానికి 365 రోజుల 5 గంటల 45 నిమిషాలుగా లెక్కించారు.  జూలియట్ క్యాలెండర్ లోని తప్పులను సరిచేసి 1582 వ సంవత్సరంలో ఎనిమిదో పోప్ జార్జ్ గ్రెగేరియన్ క్యాలెండర్ ను తయారు చేశారు.  

అప్పటి వరకు వాడిన క్యాలెండర్ జూలియస్ క్యాలెండర్ నుంచి కొత్త గ్రెగేరియన్ క్యాలెండర్ కు మధ్య తేడా 11 రోజులు ఉన్నది.  సెప్టెంబర్ 2, 1782లో ఈ క్యాలెండర్ ను అమలులోకి తీసుకొచ్చారు.  అయితే, బ్రిటన్ ప్రజలు సెప్టెంబర్ 2 వ తేదీ రాత్రి నిద్రపోయి తెల్లారి లేచే సరికి క్యాలండర్ లో 11 రోజులు మిస్ అయ్యాయి.  క్యాలెండర్ సెప్టెంబర్ 14 వ తేదీని చూపించింది.  దీంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.  11 రోజులకు జీతం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.  ఈ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  క్యాలెండర్ లో మిస్సైన 11 రోజులకుగాను జీతంతో కొద్దిన సెలవులను ఉద్యోగులకు మంజూరు చేసింది.  అప్పటి నుంచి జీతంతో కూడిన సెలవులు అనే మాట వాడుకలోకి వచ్చింది.