రేపటికల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తాం

రేపటికల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తాం

తిత్లీ తుఫాన్‌ కారణంగా శ్రీకాకుళం జిల్లా భారీ స్థాయిలో నష్టపోయింది. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. మంగళవారం మంత్రి కళా వెంకట్రావ్ మాట్లాడుతూ... తిత్లీ తుఫాన్ కారణంగా 40 వేల కరెంట్ పోల్స్ నేలకూలాయి. ఇప్పటివరకూ 38వేల స్తంభాలు కొత్తవి వేశాం అని తెలిపారు. వ్యవసాయ కనెక్షన్స్ మినహా రేపు ఉదయానికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తామన్నారు. పొలాల్లో పంటకు నష్టం కలగకుండా పనులు చేయాలని ఆదేశాలిచ్చాం. రైతుకు ఇబ్బంది లేకుండా పంట కోసుకున్న తర్వాతే పనులు జరిపిస్తామన్నారు. 12 రోజుల్లో విద్యుత్ ను పునరుద్ధరించడం మామూలు విషయం కాదు అని కళా వెంకట్రావ్ అన్నారు.