అడ్డుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి... 

అడ్డుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి... 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్నటి రోజున మొదటి దఫా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.  మొత్తం ఏడుదశల్లో ఎన్నికలు  జరగబోతున్నాయి.  అయితే, ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని ఇప్పటికే  ఉద్యోగసంఘాల నేతలు చెప్తున్నారు.  నిన్న ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ కు అనేక జిల్లాలకు చెందిన అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకాలేదు.  

ఇక ఇదిలా ఉంటె, ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని, రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఎవరు ఆటంకం కలిగించినా దానిపై గవర్నర్ కు నివేదిక అందిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.