యదార్థ సంఘటనతో 'ఎక్కడికో ఈ అడుగు'

యదార్థ సంఘటనతో 'ఎక్కడికో ఈ అడుగు'

'ఎఫెక్ట్స్ రాజు'గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఎక్కడికో ఈ అడుగు". ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా యూనిట్ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయని, మార్చి నెలలో సినిమాను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.