ఎక్కడా తగ్గని పందెం రాయుళ్ళు.. రచ్చ రచ్చే !

ఎక్కడా తగ్గని పందెం రాయుళ్ళు.. రచ్చ రచ్చే !

ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విదించినా కోడి పందాలు మాత్రం ఏపీలో ఆగలేదు. ఎప్పటిలానే ప్రజా ప్రతినిదుల ఒత్తిడికి ఈ సారి కూడ పోలీసులు తలవంచక తప్పలేదు. పండుగ మొదలు కాక ముందు హడావిడి చేసిన పోలీసులు ఆ తరువాత మాత్రం చేతులు ఎత్తేశారు.ఇదంతా ఒక ఎత్తయితే కరోనా కారణంగా పందాలకు డిమాండ్ తగ్గిందని పందెం నిర్వాహకులు వాపోతున్నారు. కరోనా కాలంలో కోడి పందాలు ఎలా ఉంటాయా అన్న అనుమానం ఉండేది...కాని పండగు ఆరంభం కు ముందే కోడి పందాలకు ఉన్న గిరాకీ మరో సారి తేటతెల్లం అయ్యిపోయింది..ఎదేమైనా సరే కోడి మాత్రం బరిలో తొగకొట్టాల్సిందే అన్న లక్ష్యంతో పందాలు జోరుగా సాగిపోయాయి.

ఎవరు అడ్డు చెప్పినా, ఎన్ని కేసులు పెట్టినా సరే పందాలు మాత్రం తగ్గలేదు. పందెం రాయుళ్ళు మాత్రం ఏమాత్రం భయం లేకుండా దూసుకుపోయారు. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కోడి పందాలు జోరుగా సాగాయి. అయితే ఈసారి ఆంక్షలు ఎక్కువగా ఉండటంతో పాటుగా కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో అదికారులు హెచ్చరికలు జారీ చేయటంతో పందాల పై ప్రభావం ఉంటుందని అంతా భావించారు.అయితే అందుకు భిన్నంగా పందాలు సాగాయి.

ఆశించిన స్దాయిలో పందాలు రాలేదని పందెం నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎటా కోడి పందాలు అంటే ఇతర రాష్ట్రాలు దేశాల నుండి కూడ గోదావరి జిల్లాలకు తరలి వచ్చేవారు.ఈ సారి మాత్రం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కరోనా నేదప్యంలో ఆర్దికంగా కొంత మేర ఒడిదుడుకుటు ఎదుర్కొంటుండగా ఇక విదేశాల్లో ఉండే వారు ఈ సారి కరోనా తో పందాలకు దూరంగా ఉన్నారు.దీంతో పందాలు చూసేందుకు జనం బాగానే తరలి వచ్చినా,ఆర్దికంగా పందాలు మాత్రం తక్కువగానే ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు.