తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? : స్వరం పెంచిన ఈటల..

తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? :  స్వరం పెంచిన ఈటల..

కేబినెట్ నుంచి ఈటలను సిఎం కెసిఆర్ తొలగించినప్పటి  నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్ ను వీడి.. అడ్రసు లేకుండా పోయారని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలోనే  కెసిఆర్ పాలనపై మొదటిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్.  హైదరాబాద్ లో ఎన్నారైలతో వర్చువల్ గా ఈటల సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా ? తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందన్నారు.  తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రలోభలకు లొంగలేదనే తనపై నిందలు మోపారని ఆరోపణలు చేశారు ఈటల. తెలంగాణను మరోసారి బానిసత్వం వైపు నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.