ముదురుతున్న వివాదం : హైకోర్టును ఆశ్రయించిన ఈటల ఫ్యామిలీ

ముదురుతున్న వివాదం : హైకోర్టును ఆశ్రయించిన ఈటల ఫ్యామిలీ

ఈటల రాజేందర్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కబ్జా వ్యవహారంలో ఆయన సతీమణి జమున, కుమారుడు నితిన్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జమున హ్యాచరీస్ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వే చేసి బోర్డులు పెట్టారని పేర్కొన్నారు. జమున హేచరీస్​ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వేలు చేసి బోర్డులు పెట్టారని మాజీ మంత్రి ఈటల సతీమణి, కుమారుడు నితిన్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెందిన భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈటల ఫ్యామిలీ పిటీషన్ వేసిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా పిటీషనర్ తరపు వాదనలు వినిపించారు  దేశాయ్ ప్రకాష్ రెడ్డి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ, విజిలెన్స్ విచారణ చేపడుతున్నారని పిటీషనర్లు ఆరోపణలు చేశారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లోకి వెళ్లి విచారణ చేపడుతున్నారన్న పిటీషనర్లు పేర్కొన్నారు. పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి భూముల్లోకి వెళ్లారని తెలిసిందన్నారు ప్రకాష్ రెడ్డి. వారి వాదనలు విన్న హై కోర్టు జామున హ్యాచరీస్ కేసును విచారణ వాయిదా వేసింది. 2.30 గంటలకు మళ్ళీ విచారణ చేపట్టనుంది హైకోర్టు.