కేసీఆర్ ధర్మాన్ని వదిలేసాడు.. ప్రగతి భవన్ కు వెళ్తే లోపలికి రానివ్వలేదు : ఈటల

కేసీఆర్ ధర్మాన్ని వదిలేసాడు.. ప్రగతి భవన్ కు వెళ్తే లోపలికి రానివ్వలేదు : ఈటల

తనపై మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల స్పందించారు.  సీఎం కెసిఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నాడని..పార్టీకి వ్యతిరేక పనులు నేనెప్పుడూ చేయలేదన్నారు ఈటల.  నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు..నాపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు.  ఎవరి చరిత్ర ఏంటో నాకు బాగా తెలుసు.. ప్రగతి భవన్ కు వెళ్తే లోపలికి రానివ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.  ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు.  వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ..  ధర్మము ఎక్కడికి పోదు.. ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు.  కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తా.. న్యాయం జరుగుతుందని తెలిపారు ఈటల. మంత్రులు గంగుల, కొప్పుల వ్యాఖ్యలు దారుణమన్నారు. పోటీ ఉన్నా కేసీఆర్ టికెట్ ఇచ్చారు.. కరీంనగర్ జిల్లాను ఆనాడు కాపాడింది కమలపూర్ అని గుర్తు చేశారు.  మంత్రుల కామెంట్స్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని..చేసిన దందాలన్నీ ఎప్పటికైనా బయటపడతాయన్నారు. 2014 నుండి కేసీఆర్ ధర్మాన్ని వదిలేసాడని.. గొప్ప వ్యక్తిగా ఉండే కేసీఆర్ ఎవరి సలహాలు వల్లనో మంత్రులను చులకన చేస్తూ ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.