సమంత సినిమాను రిజెక్ట్ చేసిన ఈషా.. కారణం అదేనంట..?

సమంత సినిమాను రిజెక్ట్ చేసిన ఈషా.. కారణం అదేనంట..?

అక్కినేని సమంత తాజాగా చేయనున్న సినిమా శాకుంతలం. ఈ సినిమాను రుద్రమదేవి షేమ్ గుణశేఖర్ డైరెక్ట్‌చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం హిమాలయాల సెట్‌ను కూడా సిద్దం చేస్తున్నారంట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శాకుంతలం సినిమాలో ఓ పాత్ర కోసం మూవీ మేకర్స్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బాను సంప్రదించారంట. ఈషా తాజాగా నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో నటించారు. అయితే ఈషా రెబ్బా సినిమాను తిరస్కరించారని, పారితోషికం ఈషా ఆశించినంత ఇవ్వకపోవడమే కారణం అంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత టైటిల్ పాత్రను పోషించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమ్మర్‌ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దుష్యంతుని పాత్ర కోసం నటులను వెతుకుతున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి సమంత, గుణశేఖర్ వారి అంచనాలను అందుకుంటారేమో వేచి చూడాలి.