మరో బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా...

మరో బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా...

లాక్ డౌన్ దెబ్బకు వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ వచ్చింది. కరోనా లాక్ డౌన్ సమయంలో లాభం పొందినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ మాత్రమే అవి కూడా వెబ్ సిరీస్ ల కారణంగా. ఓ వైపు సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడే ఆగిపోగా సినీమా పరిశ్రమకు సంబంధించిన చాలా మంది ఆర్థికంగా దెబ్బ తిన్నారు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉండటంతో  చాలామంది అగ్రతారలు వెబ్ సిరీస్ లో అడుగు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ లస్ట్‌ స్టోరీస్. ఇందులో  నటించేది తెలుగమ్మాయి ఈషా రెబ్బనే. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ.  అయితే ఈషా రెబ్బా ఇప్పుడు మరో బోల్డ్ పాత్రలో నటించబోతుంది అని తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్ కు గాను ఈషానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోల్ లస్ట్‌ స్టోరీస్ లాగానే బోల్డ్ గా ఉండనుంది అని సమాచారం. ఈషా ఇప్పటికి చాలా సినిమాల్లో నటించింది కానీ అప్పుడురాని గుర్తింపు ఈ వెబ్ సిరీస్ ల్లో చేస్తుండగానే వచ్చింది.  ఎందుకంటే తెలుగులో రావాల్సిన లస్ట్ స్టోరీస్ కోసం కూడా ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.