తల్లిదండ్రుల ఇష్టంతోనే స్కూళ్లకు... 

తల్లిదండ్రుల ఇష్టంతోనే స్కూళ్లకు... 

ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి తెలంగాణలో స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి.  ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యాసంస్థలు, పేరెంట్స్ అసోసియేషన్ తో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు.  ఈ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించారు.  తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతారని అన్నారు.  ప్రైవేట్ స్కూళ్లలో ఆన్లైన్, ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించాలని అన్నారు.  6,7,8, తరగతుల క్లాసులు ప్రారంభించాలని ప్రైవేట్ స్కూళ్లు కోరాయని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.  ఇక ఖచ్చితంగా తరగతులకు విద్యార్థులు హాజరుకావాలని రూల్ లేదని, ఫీజుల విషయంలో కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.  తల్లిదండ్రుల ఇష్టంతోనే పిల్లలను స్కూళ్లకు పంపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశంలో పేర్కొన్నారు.