చిక్కులో కాశ్మీర్ మాజీ సీఎం..

చిక్కులో కాశ్మీర్ మాజీ సీఎం..

కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నిస్తుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ యొక్క నిధుల గోల్ మాల్ విషయంలో ఫరూక్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణ శ్రీనగర్ లోనే జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో 113 కోట్ల గోల్ మాల్ జరిగింది. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫరూక్ అబ్దులాను రాజకీయంగా ఎదుర్కోవడంలో విఫలమైనందుకే ఆయనను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్ధలను బీజేపీ ఉసిగొలుపుతుంది అని నేషనల్ కాన్ఫరెన్స్ ఆరోపించింది. అయితే జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్ గా ఫరూక్ ఉన్న సమయంలో 43 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీని పై ఫరూక్ ను ఈడీ ప్రశ్నిస్తుంది.