ప్రభుత్వ అధికారాలను అణిచివేశారు

ప్రభుత్వ అధికారాలను అణిచివేశారు

రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో ఈసీ జోక్యం చేసుకుందని, ప్రభుత్వ అధికారాలను అణచివేశారని సీఎం దుయ్యబట్టారు. ఏ కారణం లేకుండా అధికారులను బదిలీ చేశారని, టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందని, ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే స్పందించలేదని మండిపడ్దారు. ఈవీఎంలను మరమ్మతు చేసే వారి అర్హతలేమిటని బాబు ప్రశ్నించారు. శనివారం చంద్రబాబునాయుడు బృందం సీఈసీ సునిల్ అరోరాతో గంటన్నర సేపు భేటీ అయింది. ఏపీలో పోలింగ్ తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో ఎన్నికల సంఘం విఫలమైందని లేఖ ఇచ్చామని తెలిపారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని బాబు ధ్వజమెత్తారు. అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందని, ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే స్పందించలేదని మండిపడ్దారు. ఈవీఎంలను మరమ్మతు చేసే వారి అర్హతలేమిటని బాబు ప్రశ్నించారు.