కూకట్‌పల్లిలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం..
భారీ వర్షాలు కురిసిన సమయంలో హైదరాబాద్ భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి.. బోరబండ ప్రాంతంలో ప్రజలకు కొన్ని రోజుల పాటు కంటిపై కునుకులేకుండా చేశాయి.. మరోసారి హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి.. ఈ సారి కూకట్‌పల్లిలో భూప్రకంపనలు సంభవించాయి.. స్థానిక అస్బెస్టాస్ కాలనీలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో భూమి కంపించిది. రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమయంలో భూమిలోపల నుంచి భారీ శబ్ధాలు వచ్చాయంటున్నారు.. ఊహించని పరిణామంతో షాక్‌తిన్న స్థానికులు.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)