ఓపెనింగ్‌ మ్యాచ్‌కు డుప్లెసిస్‌ దూరం

ఓపెనింగ్‌ మ్యాచ్‌కు డుప్లెసిస్‌ దూరం
ఐపీఎల్‌ 11వ సీజన్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవబోతోంది. మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 9 ప్రధాన నగరాల్లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగుతాయి. ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే చెన్నై జట్టకు షాక్‌ తగిలింది. చేతి వేలు గాయం కారణంగా ఈ మ్యాచ్‌ను డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ తప్పుకున్నాడని జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. దీంతో సామ్‌ బిల్లింగ్స్‌కు జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. కాగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో తెలుగు తేజం అంబటి రాయుడికి ఫైనల్‌ లెవెన్‌లో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.