బర్త్ డే స్పెషల్  .. దుల్కర్ 'కురుప్' టీజర్ విడుదల

బర్త్ డే స్పెషల్  .. దుల్కర్ 'కురుప్' టీజర్ విడుదల

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు దుల్కర్ . నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ''కురుప్'' టీజర్ రిలీజ్ చేసారు. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంచి ఆదరణ తెచ్చుకోగా ఇప్పుడు టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.