రఘునందన్‌రావు సంచలనం... నన్ను టీఆర్ఎస్‌ నేతలే గెలిపించారు..!

రఘునందన్‌రావు సంచలనం... నన్ను టీఆర్ఎస్‌ నేతలే గెలిపించారు..!

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా ప్రమాణస్వీకారం చేశారు రఘునందన్‌.. అయితే, తనను గెలిపించింది టీఆర్ఎస్‌ నేతలే అంటూ ఆయన ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.. దుబ్బాక బై పోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్‌రావు.. విశ్రాంతిలేకుండా ప్రచారం చేశారు.. దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్యను గెలిపించేందుకు కృషి చేశారు.. కానీ, ఉత్కంఠభరిత పోరులో విజయం రఘునందన్‌ను వరించింది.. ఇక, మీ విజయం వెనుక ఎంఐఎం నేతలు కూడా ఉన్నారంటూ విమర్శలు వస్తున్నాయంటూ ఎన్టీవీ ప్రతినిధి ప్రశ్నించగా.. నన్ను గెలిపించింది టీఆర్ఎస్ నేతలే అనే విషయం ఎందుకు గ్రహించడం లేదంటూ ప్రశ్నించారు రఘునందన్..

తెలంగాణ ఉద్యమంలో అనేక మందితో కలిసి పనిచేశా.. గతంలో పోటీ చేసి ఓటమిపాలయ్యా.. ఈ సారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు.. అలాంటి పరిస్థితుల్లో మేం నిలబడి విజయం సాధించామని.. మాతో పాటు.. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న రఘునందన్‌రావుకు ఓటువేస్తే తప్పేంటన్న ఆలోచన టీఆర్ఎస్‌ నేతలే చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, తనను టీఆర్‌ఎస్‌ నుంచి ఎందుకు బయటికి పంపించారో ఇప్పటికీ సమాధానం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఇక సమాధానం వస్తుందని అనుకోవడం లేదన్నారు. బీజేపీలో చేరిన తనను పార్టీ ఆదరించి.. పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్నారు. దుబ్బాక విజయం బీజేపీదేనన్న ఆయన.. రఘునందన్‌ను, బీజేపీని వేరుగా చూడాల్సిన అవసరం రాదన్నారు... తన నియోజకవర్గానికి రావాల్సింది సామారస్యంగా అడిగి చూస్తా.. లేదంటే కొట్లాడైనా సాధించుకుంటానంటున్న రఘునందన్‌రావు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...