చిన్న పావురం కోసం బెంజ్ కారును వదిలేసిన దుబాయ్ ప్రిన్స్ 

చిన్న పావురం కోసం బెంజ్ కారును వదిలేసిన దుబాయ్ ప్రిన్స్ 

కారు ఖరీదైన వాహనం.  అందులో బెంజ్ కారు ఖరీదు ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.  అటువంటి కారుపై చిన్న మరక పడితేనే తట్టుకోలేరు.  ఓ పక్షి గూడుకట్టుకుంటే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి.  మనమైతే ఆ గూడును పక్కకు జరిపి కారు తీసుకొని వెళ్లారు.  కానీ, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మాత్రం అలా చేయలేదు.  తన బెంజ్ కారుపై ఓ పావురం గూడు కట్టుకుంది. 

దీంతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆ కారును పావురం కోసం వదిలేశాడు.  అంతేకాదు, గూడు చెదిరిపోకుండా ఉండేందుకు కారు చుట్టూ తాళ్లు కట్టారు.  అటువైపు ఎవరూ వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు.  కారుపై ఉన్న గూడుకు ఎండ తగలకుండా ఉండేందుకు టార్పాలిన్ కట్టారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.