దృశ్యం 2 ఓటీటీపై నిర్మాత క్లారిటీ

దృశ్యం 2 ఓటీటీపై నిర్మాత క్లారిటీ

విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం 2. ఈ సినిమాలో వెంకటేష్ సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను వెంకటేష్ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, కరోనా మహమ్మారి కారణంగా దృశ్యం 2 మలయాళ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో చిత్ర నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.