బ్రేకింగ్ : కరోనా వ్యాక్సిన్ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రైల్స్ కి అనుమతి

బ్రేకింగ్ : కరోనా వ్యాక్సిన్ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రైల్స్ కి అనుమతి

హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్)లు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రెండో దశ మానవ క్లినికల్ ట్రయల్ కి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించాయి. 2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మరియు ఆర్డిఐఎఫ్ లు స్పుత్నిక్  వి వ్యాక్సిన్ ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుంది.