విచారణ అందుకే..రాయపాటి కోడలు క్లారిటీ !

విచారణ అందుకే..రాయపాటి కోడలు క్లారిటీ !

ఈరోజు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు, గుంటూరు రమేష్ ఆసుపత్రి మేనేజ్మెంట్ మెంబర్ అయిన డాక్టర్ మమత విజయవాడ పోలీసుల విచారణకు హాజరయిన సంగతి తెలిసిందే. ఆరు గంటలు పాటు సాగిన ఈ విచారణ అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ హాస్పిటల్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం విజయవాడ పోలీసులు నోటీస్ ఇవ్వడం వల్ల విచారణ కు హాజరయినట్లు వెల్లడించారు. తన పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని ఆమె అంటున్నారు. గుంటూరు రమేష్ హాస్పిటల్స్  ఆపరేషన్స్ కు సంబంధించిన అంశాలు మాత్రమే తాను పరిశీలిస్తున్నట్లు డాక్టర్ మమత వెల్లడించారు.  

ఇక ఆమె అడ్వకేట్ ఉమా శంకర్ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకుంటున్న డాక్టర్ మమతా ను  దాదాపు 7గంటలు విచారించడం తగదని అన్నారు. పూర్తిగా కోలుకోని ఆమె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో పోలీస్ వారికీ అంత కంటే ఇంకా ఎక్కువ ప్రమాదమని అన్నారు. పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నవారిని ఇలా ఇబంది పెట్టకూడదని ఆయన అన్నారు. సంబంధం లేని వ్యక్తిని ఈ విషయంలో పదే పదే ఇబ్బంది పెట్టడం తగదని ఆయన అన్నారు. హాస్పిటల్, హోటల్ యాజమాన్యాలను నిందించే  ముందు ఈ తప్పు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్,  ఫైర్ శాఖలది కూడా అని అన్నారు. ముందస్తు పరిస్థితులు స్థితి గతులు అధ్యయనం చేయకుండా జిల్లా కలెక్టర్, మున్సిపల్, ఫైర్, dhmo లు ఎలా  అనుమతిస్తారు?? అని ఆయన ప్రశ్నించారు.