మూకదాడులతో దేశ ప్రతిష్టకు భంగం...

మూకదాడులతో దేశ ప్రతిష్టకు భంగం...

భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం.. ఇక్కడ అన్ని మతాలవారికి, అన్ని సంస్కృతుల వారికి సమానమైన హక్కులు ఉంటాయి.  భారతదేశంలో అందరు కలిసిమెలిసి జీవిస్తున్నారు.  ఇలా కలిసిమెలిసి జీవించే దేశంలో మూకదాడుల వంటి  కొన్ని సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి అని మోహన్ భగత్ పేర్కొన్నారు.  

నాగపూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ సంచాలక్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పాల్గొన్నారు.  విజయదశమి సందర్భంగా నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయుధపూజను నిర్వహించారు. అనంతరం అయన వివిధ విషయాల గురించి మాట్లాడారు.  అందులో ముఖ్యంగా మూకదాడులు, ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రతా వంటి విషయాలు ముఖ్యమైంది.  ఇండియాను ఏకత్వంలో భిన్నత్వం అని అంటారు.  ఇందులో  భిన్నత్వం అనేది దేశానికి అంతర్గత శక్తి అని, కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల విభేదాలకు తావిస్తుందని మోహన్ భగత్ పేర్కొన్నారు.  ఈ విభేదాల నుంచే స్వార్ధ శక్తులు పుట్టుకొస్తున్నాయని, అలాంటి స్వార్థ శక్తుల కుట్రలను గుర్తించి అప్రమతం కావాలని, వాటిని తిప్పికొట్టాలని మోహన్ భగత్ పేర్కొన్నారు. ఎలాంటి అభిప్రాయాలు  ఉన్నా, ఎలాంటి రెచ్చగొటే ప్రయత్నాలు చేసినా.. ఎవరు ఎలాంటి చర్యలకు పాల్పడినా అవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని అన్నారు.   పరిధిదాటి ప్రవర్తించకూడదని మోహన్ భగత్ ఈ సందర్భంగా తెలియజేశారు.