దయచేసి మమ్మల్ని తిట్టోద్దుః పాక్ బౌలర్

దయచేసి మమ్మల్ని తిట్టోద్దుః పాక్ బౌలర్

ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఘోరపరాజయం పొందిన పాకిస్థాన్‌ జట్టును ఆ దేశ అభిమానులు అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు. దీనిపై పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘దయచేసి మాపై అసభ్య పదాలను ఉపయోగించకండి. మా ప్రదర్శనపై  విమర్శించండి. అంతే కానీ అలాంటి పదాలు వాడొద్దు. ఇకపై మేం మంచి ప్రదర్శన చేస్తాం. మాకు మీ మద్దతు కావాలి’ అని తెలిపాడు. ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 89 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్ల ప్రదర్శన, వారి ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.