కరోనా వేళ అతిగా డ్రై ఫ్రూట్స్ తింటున్నారా ? ఇది మీకోసమే !

కరోనా వేళ అతిగా డ్రై ఫ్రూట్స్ తింటున్నారా ? ఇది మీకోసమే !

కరోనా వేళ రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు జనం.. కొందరు విటమిన్ ట్యాబ్లెట్లను నమ్మకుంటే మరికొందరు డ్రై ఫ్రూట్స్ ఇమ్యూనిటీ పెంచుతాయని తింటున్నారు.. అయితే అతిగా డ్రై ఫ్రూట్స్ తినటం మంచి కంటే చెడుకు దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ ఫుడ్ హాబిట్స్ ను కూడా చేంజ్ చేసింది. రెగ్యులర్ మీల్స్, డైట్ తో పాటు హెల్దీ ఫుడ్ కంపల్సరీగా అనటంతో ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ పై సిటిజన్స్ ఫోకస్ పెట్టారు. డ్రై ప్రూట్స్ తినటానికి మక్కువ చూపుతున్నారు.  హెల్త్ కాన్షియస్ పెరగడంతో ధర ఎక్కువైనా కొనేందుకు జనం వెనుకాడడం లేదు. కరోనా రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తుండటం, పాజిటివ్ పేషేంట్స్ కు ప్రిస్కిప్ష న్లో హెల్దీ డైట్ మెన్ష న్ చేస్తుండడమూ ప్రభావం చూపుతోంది. 

డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. అన్ని బిజినెస్ లు పడిపోతే, డ్రై ఫ్రూట్స్ వ్యాపారం మాత్రం ఊపు మీద ఉంది. అవసరం ఉన్నా లేకున్నా పెద్ద ఎత్తున జనం డ్రై ప్రూట్స్ కొంటున్నారు తింటున్నారు. అయితే డ్రై ప్రూట్స్ వల్ల కొన్ని విటమిన్లతో పాటు వెంటనే శక్తి కూడా అందుతుందని కానీ మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాధం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వాస్తవానికి డ్రై ఫ్రూట్స్ లో బాధాం, పిస్తా, కాజు, వంటివి జనం ఎక్కువగా తింటున్నారు. కరోనా ను తట్టుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ తింటే, రోగ నిరోధక శక్తి పెరుగుతొందని భావిస్తున్నారు. కానీ ఇవి ఎక్కువగా అంటే మోతాదుకు మించి తింటే శరీరంలో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఊబకాయం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.