హోదా మృతులకు అసెంబ్లీ సంతాపం...

హోదా మృతులకు అసెంబ్లీ సంతాపం...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్న మృతులకు సంతాపం ప్రకటించింది ఏపీ అసెంబ్లీ... మృతులకు సంతాపంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా కాసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జరుగుతోన్న ఆత్మహత్యలపై సభలో ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుదామని పిలుపునిచ్చాన ఆయన... అధైర్యపడొద్దు... ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదన్నారు.