ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: 15 నిమిషాల్లో కరోనా తగ్గింది 

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: 15 నిమిషాల్లో కరోనా తగ్గింది 

అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రచారం జోరుగా సాగుతోంది.  ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఇటీవలే తన కుమారుడు 14 ఏళ్ల బారన్ కు కరోనా సోకిందని ట్రంప్ చెప్పారు.  బారన్ వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు చెప్పారని, 15 నిమిషాల తరువాత మరలా వైద్యులను అడగ్గా, కరోనా పోయినట్టు వైద్యులు చెప్పారని, పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి బలంగా ఉంటుందని, భయపడాల్సిన అవసరంలేదని, అన్నారు. కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని స్కూల్స్ మూసేయడం తగదని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండవని ట్రంప్ చెప్తున్నాడు.  అయితే, అమెరికాలో 7,92,000 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 11 శాతం మంది పిల్లలు ఉన్నారని తేల్చి చెప్పింది.  దీంతో స్కూల్స్ విషయంలో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.