ట్రంప్ వినూత్న నిరసన : ఆ దేశాలు బయటపెట్టడం లేదు... 

ట్రంప్ వినూత్న నిరసన : ఆ దేశాలు బయటపెట్టడం లేదు... 

కరోనా వైరస్ పై ప్రపంచదేశాలు భారీ ఎత్తున యుద్ధం చేస్తున్నాయి.  కరోనా కారణంగా ఎవరూ  బయటకు రావడం లేదు అన్నది వాస్తవం.  కరోనా వైరస్ కు సరైన మందు లేకపోవడంతో ఇంతమంది వైరస్ బారిన పడుతున్నారు.  కరోనా కారణంగా మరణిస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో ఈ వైరస్ మొదలైంది.  అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది.  

మిగతా దేశాలతో  పోలిస్తే అమెరికాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  మరణాల సంఖ్య కూడా అదేవిధంగా యూ అంటోంది.  దీనిపై అమెరికా అనేక ఆరోపణలు చేస్తున్నది.  అమెరికా మాత్రమే ఖచ్చితమైన డేటాను ఇస్తోందని, ఇంఫెక్షన్ సోకిన వివరాలు, మరణాల సంఖ్యను నిజాయితీగా ప్రకటిస్తోందని, కానీ, చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా లాంటి చాలా దేశాలు డేటాను బయటపెట్టడం లేదని, తప్పుడు డేటాను ఇస్తున్నాయని ట్రంప్ నిరసన వ్యక్తం చేస్తున్నాడు.