హెచ్ 1-బీ వీసా హోల్డర్లకు ట్రంప్ గుడ్‌న్యూస్‌

 హెచ్ 1-బీ వీసా హోల్డర్లకు ట్రంప్ గుడ్‌న్యూస్‌

కరోనా ఎఫెక్ట్ హెచ్ 1 బీ వీసాలపై కూడా ప‌డింది.. లాక్ డౌన్ కారణంగా దేశంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవటంతో కొత్తగా వర్క్ వీసాలను కొన్ని నెలల పాటు బ్యాన్ చేయాలని అమెరికా యోచించింది.. దీనికి సంబంధించిన విధివిధానాల‌పై ట్రంప్ స‌ర్కార్ క‌స‌ర‌త్తు కూడా చేసిన‌ట్టు కూడా చూశాం.. అయితే, తాజాగా హెచ్ 1-బీ వీసా హోల్డర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్ర‌భుత్వం.. ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారిని అనుమతించాలని కీల‌క నిర్ణ‌యం తీసుకుంది యూఎస్ విదేశాంగ శాఖ. కానీ, అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాల‌ని ష‌ర‌తు పెట్టింది. భర్త లేదా భార్య తమ పిల్లలతో సహా వారిని.. ప్రైమరీ వీసా హోల్డర్లతోపాటు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. 

మొత్తానికి వీసా నిషేధాన్ని ప్రకటించడానికి ముందు వారు కలిగి ఉన్న అదే ఉద్యోగాలకు తిరిగి వస్తున్నట్లయితే, హెచ్ -1 బి వీసా హోల్డర్లు అమెరికాలోకి ప్రవేశించడానికి ట్రంప్ స‌ర్కార్ కొన్ని నిబంధనలను సడలించింది. యూఎస్‌లో కొనసాగుతున్న ఉపాధిని అదే యజమాని మరియు వీసా వర్గీకరణతో తిరిగి ప్రారంభించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. పరిపాలన సాంకేతిక నిపుణులు, సీనియర్-స్థాయి నిర్వాహకులు మరియు H-1B వీసాలు కలిగి ఉన్న ఇతర కార్మికుల ప్ర‌యాణానికి కూడా అనుమతించింది. కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాలను తగ్గించడానికి లేదా గణనీయమైన ప్రజారోగ్య ప్రయోజనంతో ఒక ప్రాంతంలో కొనసాగుతున్న వైద్య పరిశోధనలను నిర్వహించడానికి ప్రజారోగ్యం లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా పరిశోధకుడిగా పనిచేస్తున్న వీసా హోల్డర్ల ప్రయాణాన్ని కూడా పరిపాలన అనుమతించింది ట్రంప్ స‌ర్కార్. క‌రోనా వైర‌స్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అయ్యింది.. అగ్ర‌రాజ్యం క‌రోనా కేసుల్లో అగ్ర‌భాగాన ఉండ‌డ‌మే కాదు.. ఆ దేశ ఆర్థిక ప‌రిస్థితిపై కూడా ప్ర‌తీకూల ప్ర‌భావం చూపింది. దీంతో.. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగుతోంది ట్రంప్ ప్ర‌భుత్వం.